Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
కేవీకే గడ్డిపల్లి వారి అధ్వర్యంలో గ్రామీణ కషి అనుభవ కార్యక్రమం పొందుతున్న లోయోల కళాశాల వ్యవసాయ డిగ్రీ విద్యార్థినులు గరిడేపల్లిలో వరి నాట్లు వేసే విధానాన్ని పరిశీలించి నాట్లు వేసే కూలీలతో కలసి నాట్లు వేసి క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందినట్లు గ్రూప్ లీడర్ నీరజ తెలిపారు.నాట్లువేసే సమయంలో చదరపు మీటర్‌కు 33 కుదుర్లు వుండేలా పొలంలో కొద్దిగా నీటిని ఉంచిపై పైన నాట్లు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చన్నారు.కళాశాలలో నేర్చుకొన్న అంశాలను ప్రాక్టికల్‌గా ఇక్కడ నేర్చుకొంటున్నామన్నారు.నాట్లు వేసేటప్పుడు వరి కొనలు తుంచి నాటుకోవాలని తద్వారా కాండం తొలిచే పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసి పంటను కాపాడుకోవచ్చన్నారు.అదేవిధంగా నాట్లు వేసేటప్పుడు ప్రతి రెండు మీటర్లకు కాలి బాటలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు సంధ్య, అఖిల, జ్యోతిక, రాణి, మానస, గ్రీష్మ, రైతుకూలీలు పాల్గొన్నారు.