Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోదాడరూరల్
కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు అయ్యేంతవరకు పోరాటం సాగిస్తామని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మేదరమెట్ల వెంకటేశ్వరావు,సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని తదిత టీ స్టాల్ దగ్గర జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు.డిసెంబర్ 9, 2021న కిసాన్ మోర్చా పోరాటం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించినదన్నారు.కనీస మద్దతుధరపై కమిటీ ఏర్పాటు లో తీవ్రమైన మోసం చేసిందన్నారు. రైతులపై మోపిన తప్పుడు కేసులు ఎత్తివేయలేదని, ఆందోళన విరమించుకున్న సమయంలో విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుని వర్థంతి రోజైన జూలై 31 దేశవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయిలో ద్రోహానికి వ్యతిరేకంగా నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై రాస్తా రోఖో చేయడం జరిగిందని వారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు మా పోరాటం ఆగదని వారన్నారు. ఈ కార్యక్రమంలో కౌలుదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సైదా, రైతుసంఘం జిల్లా నాయకులు దేవరం వెంకటరెడ్డి, దాసరి శ్రీనివాస్, మంద వెంకటేశ్వర్లు ,పాలే కృష్ణ, వెంకన్న, నర్సింహారావు, రాములు, లింగయ్య పాల్గొన్నారు.