Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లిశివకుమార్, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వరికుప్పల వెంకన్న, రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధా సత్యనారాయణ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో వారు మాట్లాడారు.డిసెంబర్ 9, 2021న కిసాన్‌మోర్చా పోరాటం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు.కనీస మద్దతుధరపై కమిటీ ఏర్పాటు లో తీవ్రమైన మోసం చేసిందన్నారు. రైతులపై మోపిన తప్పుడు కేసులు ఎత్తివేయలేదని, ఆందోళన విరమించుకున్న సమయంలో విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకుప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా షహీద్ ఉధమ్‌సింగ్ అమరవీరుని వర్థంతి రోజైన జూలై 31 దేశవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయిలో ద్రోహానికి వ్యతిరేకంగా నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీ పభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పళ్లి సైదులు, ఎలుగూరి గోవిందు,కోటగోపి, దండవెంకట్రెడ్డి,మేకనబోయిన శేఖర్, చెరుకు యాకలక్ష్మి, జిల్లపల్లి నర్సింహారావు, వీరబోయిన రవి,మద్దెల జ్యోతి,మేకనబోయిన సైదమ్మ, చిన్నపంగినర్సయ్య, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి షేక్నజీర్,న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు,దేశోజు మధు, పోలబోయిన కిరణ్, వీరబోయినరమేష్,డి .ప్రవీణ్,వెంకన్న, ఎంసీపీఐయూ జిల్లా నాయకులు ఏపూరి సోమన్న, ఏశబోయినసుధీర్,నాయకులు బత్తుల వెంకన్న, మామిడి సుందరయ్య, దండ శ్రీనివాస్‌రెడ్డి,నారాయణ వీరారెడ్డి,నంద్యాల కేశవరెడ్డి, నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మేళ్ళచెర్వు : మండలకేంద్రంలో రైతుసంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వట్టెపు సైదులు, అజిత్‌రావు, మర్ల కొండలు, రాజమోహన్‌రెడ్డి, ఖాశీం,సైదా, దస్తగిరి, మదార్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, నర్సింహారావు పాల్గొన్నారు.