Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ నియోజవర్గ మహాసభలో వక్తలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
జర్నలిస్టులు ఐక్యంగా ఉండే హక్కులు సాధించు కోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాల యంలో ఆ సంఘం నియోజకవర్గ మహాసభ నిర్వహిం చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాల న్నారు.దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పనిచేసే జర్నలిసు ్టలందరికీ ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరారు.ప్రయివేట్ విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు.ప్రైవేట్ ఆస్పత్రులలో జర్నలిస్టు కుటుంబసభ్యులకు ఉచిత ఓపీ ఇవ్వాలని, టెస్టులలో 25శాతం రాయితీ కల్పించాలని కోరారు.జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకచట్టం చేయాలని కోరారు.జర్నలిస్టులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.జర్నలిస్టులపై అసత్య ప్రచారాలు చేసిన, సోషల్ మీడియా వేదికగా విలువలను పోగొట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిరంతరం జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం సంఘం పనిచేస్తుందని చెప్పారు.సంఘం బలోపేతం కు జర్నలిస్టులు కషి చేయాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక ఇదే..
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా ఖాజా హామీదుద్దీన్, అధ్యక్షులుగా మంద సైదులు, ఉపాధ్యక్షులుగా నాగయ్య, పగిడి రామకష్ణ, రమేష్, పాలకూరి నాగరాజు, ఉప్పతల మహేష్, నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా గద్దల జయరాజు, సహాయ కార్యదర్శిలుగా ఎండి రఫీ, గోపి, సతీష్, రసూల్, భాస్కర్, బంటు శ్రీనివాస్, కోశాధికారిగా అంకతి రాజ్ కుమార్ తో పాటు 27 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.నూతన కమిటీని శాలువా,పూలదండలతో ఘనంగా సత్కరించారు.సీనియర్ జర్నలిస్టు సుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులు మహేష్,భాస్కర్ పుప్పాలయాదగిరి, ఖాజా నాజీముద్దీన్, నాగాచారి, హర్షద్‌ఖాన్, నసీరోద్దీన్, కిరణ్‌రెడ్డి, నాగేందర్, శ్రీను, చాడ శ్రీనివాస్‌రెడ్డి, అరుణ్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, నాగయ్య, వీరయ్య, శేఖర్, సునీల్, రామకష్ణ, వేణుప్రసాద్రెడ్డి,కట్టబాబు తదితరులు పాల్గొన్నారు.