Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి:ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్,వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎండి.పాషా అధ్యక్షతన భువనగిరిలోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ,ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు, అసంఘటిత రంగం కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 03 న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో అటో,కార్,లారీ అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎండి.పాషా, జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి నానచర్ల రమేష్, జిల్లా నాయకులు బత్తిని బాలరాజు, గోడ్డేటి యాదగిరి,బలరాం,శివ పాల్గొన్నారు.