Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
విద్యార్థులు తరగతిగదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు సమాజాన్ని కూడా చదవాలని టీఎఫ్టీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు అన్నారు.ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన పీడీఎస్‌యూ జిల్లా కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సింహాద్రి జెండా ఎగురవేశారు.అనంతరం మనోహర్ రాజు మాట్లాడుతూ విద్యారంగంలో అసమానతలు కొనసాగు తున్నాయన్నారు.అందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సాహిస్తూ, ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపి ంచారు.తద్వారా పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు జార్జిరెడ్డి, కోలా శంకర్, మారోజు వీరన్నలను ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆవుల అశోక్‌కుమార్, కొత్తపల్లి శివకుమార్, నాగేశ్వరరావు, బోయినపల్లి రాము, ఎర్ర అఖిల్‌కుమార్, సింహాద్రి, కొత్తపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు.