Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల అమలుకు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా నేడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు, ఈ కార్యక్రమంలో కార్మికులు, వ్యవసాయకార్మికులు, రైతులు పెద్దఎత్తున పాల్గనాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు, తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డిభవన్లో వారు విలేకర్లతో మాట్లాడారు.దేశంలో కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు.వారికి కనీస వేతనాలు నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయంలో కీలక పాత్ర పోశిస్తున్న వ్యవసాయ కార్మికుల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.చారిత్రాత్మకంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని పేర్కొన్నారు.వలసల నివారణకు ఈ పథకం తోడ్పడుతున్నదన్నారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, రైతుసంఘం జిల్లా నాయకులు నారాయణ, వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయకార్మికసంఘం జిల్లా నాయకులు తీగల లింగయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి సుందరయ్య, వల్లపుదాసు సాయికుమార్ పాల్గొన్నారు.