Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-నల్లగొండ
ఏడాది పాటు ఢిల్లీలో రైతు వ్యతిరేకచట్టాలను రద్దు చేయాలని పోరాటాలు జరిగిన సందర్భంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస మద్దతుధర చట్టం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని సుభాష్విగ్రహం దగ్గర రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేకచట్టాలను రద్దు చేయాలని ఏడాది పాటు రైతాంగం పోరాటం చేసి ప్రభుత్వాన్ని దిగొచ్చి చట్టాలు రద్దు చేసే వరకు పోరాడాలన్నారు.ఆ సందర్భంలోనే రైతు పండించిన పంటకు గిట్టుబాటయ్యే విధంగా కనీసం మద్దతు ధర చట్టాన్ని చేసి పార్లమెంట్లో ఆమోదింప చేస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో కనీస మద్దతుధర చట్టం ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలని కేంద్రం చేసిన కుట్రను రైతాంగం ఐక్య పోరాటాల ద్వారా భగం చేసిందని గుర్తు చేశారు.ఆహారఉత్పత్తులపై జీఎస్టీతో సామాన్యులు జీవించలేని స్థితికి తీసుకొస్తున్నారన్నారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళ జిల్లా కన్వీనర్, దండంపల్లి సరోజ, చేతి వత్తిదారుల సంఘాల నియోజకవర్గ కన్వీనర్ కొండా వెంకన్న పాల్గొని మాట్లాడుతూ కనీసం మద్దతు ధర చట్టం కోసం జరిగే రైతాంగ పోరాటాలకు మద్దతుగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు రైతులు కుంభం కష్ణారెడ్డి, నలుపరాజు సైదులు, తుమ్మల పద్మ, కొండా అనురాధ, భూతం అరుణకుమారి, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, బొల్లు రవీందర్,గనిపల్లి రాములు, ఊట్కూరు మధుసూదన్‌రెడ్డి, ఉప్పల గోపాల్, మందడి రామచంద్రారెడ్డి, గడ్డం రాములు సల్లోజు విష్ణుమూర్తి కట్ట అంజయ్య , కతుల ముత్తయ్య,లోకసాని జానారెడ్డి,మేకల రవీందర్ రెడ్డి,గడ్డం వెంకన్న ,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి: మండలకేంద్రంలో పార్లమెంటులో రైతుల పంటలకు మద్దతుధర చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీసభ్యులు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్,మండల కార్యదర్శి దేవిరెడ్డి మల్లారెడ్డి, మండల అధ్యక్షులు కొంచెంవెంకన్న, నాయకులు మునగాల నారాయణరెడ్డి, పండగ నాగయ్య, బట్టు సైదిరెడ్డి, బట్టు హనుమారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ : రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు అందేలా చట్టం చేయాలని తెలంగాణ రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయా రైతు సంఘాల నాయకులు వస్కుల సైదమ్మ, కన్నెకంటిరామకష్జ్ఞ, సూర్యం, భరత్, ఖాశీ, కిరణ్, కె.సీతారాములు, పిల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : రైతులు అత్యధికంగా పండించే వరి ధాన్యానికి మద్దతు ధరను చట్టబద్ధత చేయాలని తెలంగాణ రైతు సంఘం మహిళ రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టణంలోని మెయిన్‌సెంటర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి ధాన్యానికి ఎమ్మెస్ పి ప్రకారం మద్దతు ధరను ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్నారు. రైతులు తమ హక్కుల కోసం చేసిన వివిధ ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోల సందర్భంగా ప్రభుత్వం వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మర్రి వెంకటయ్య, వెంకట రంగారెడ్డి, బొడ్డుపల్లి లక్మినర్సు, నాగమ్మ, వెంకటేశ్వర్లు, కష్ణ, లక్ష్మి, శశికళ పాల్గొన్నారు.