Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుహులకు అందని ఆసరా పింఛన్లు
- మూడేండ్లుగా ఇబ్బందులు పడుతున్న లబ్దిదారులు
నవతెలంగాణ-పెద్దవూర
తెలంగాణ ప్రభుత్వ ఆసరా' పింఛను పథకం అర్హులకు అందడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛన్లు ఇంతవరకు రావడంలేదు.ఇటీవల వద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గించాక మండలంలో 425 మంది దరఖాస్తులు చేసుకున్నారు.దరఖాస్తు చేసుకొని మూడేండ్లవుతున్నా ఇప్పటికీ మొదలుకాలేదు.దీంతో ఎంతోమంది వద్ధులు, వితంతువులు ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.58 ఏండ్ల నుంచి 65 ఏండ్లు దాటినవారికి, ఇంటిపెద్దను కోల్పోయి ఆసరా కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా రెండున్నరేేండ్లుగా పింఛను మంజూరు కావడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛను రావటంలేదు.లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు ఇవాల్సిఉండగా పాలకులు అవేమి పట్టించు కోవడం లేదు.2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.మూడేండ్లలో పింఛనుకు అర్హత పొందిన లబ్ధిదారులు మండలంలో 2019వరకు 26 పంచాయతీలలో 425 మంది ఉన్నారు.నెలకు రూ.2,016 వస్తే అనారోగ్య అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు వద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సు 57 ఏండ్లకు తగ్గించిన తరువాత మరో 400లకు పైగా దరఖాస్తులు వచ్చాయి.గత నెలలో మరోసారి అవకాశమివ్వడంతో మరో మరో 100 కు పైగా వచ్చినట్లు తెలిసింది.వీటిని ఎప్పటి నుంచి పరిష్కరించాలో గ్రామీణాభివద్ధిశాఖ నిబంధనలు, గడువును వెల్లడించలేదు.అర్హత వయస్సు తగ్గించాక కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో.. 65 ఏండ్లు దాటిన వారూ ఉన్నారు.
నాలుగేండ్లుగా పింఛన్ రావడం లేదు.
మంద లింగమ్మ ..బట్టుగూడెం
నాభర్త చనిపోయి నాలుగేండ్లు పించంకోరకుధరఖాస్తుచేసుకున్న ఇంతవరకు పింఛను రావడం లేదు.చాలా సార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను అడిగిన కొత్తవి ఇంకా రావడం లేదు.కొత్త పింఛన్లు వచ్చినప్పుడు వస్తాయి.
పింఛను రాక ఇబ్బందులు పడుతున్నా
ఎల్లమ్మ..పెద్దవూర
మూడేండ్ల కింద దరఖాస్తు చేసుకున్న మూడేళ్ళుగా పింఛను రావడంలేదు.కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఫలితం ఉండడం లేదు.మాలాంటి అర్హులకు పింఛన్లు అందడంలేదు.అధికారులు పింఛను అందేలా చూడాలి.
ఆసరా పింఛన్లు ఇవ్వకపోతే ఆందోళన చేపడ్తాం
బీఎస్పీ ఇన్చార్జి-వెంకటేశ్వర్లు
మూడేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్లను వెంటనే మంజూరు చేయాలి.అర్హులైన పేదలకు పింఛన్ల కొరకు తిరిగి,తిరిగి అలసిపోతున్నారు.పింఛన్లు మంజూరు చేయకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాలు,జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేపడతాం.