Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుడికాల్వకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఎగువ శ్రీశైలం జలాశయం ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ దిగువన ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు 20,954 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది.దీనితో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 555.90 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 222.9647 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం,లోలేవల్ కెనాల్ ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు,ఎడమ కాలువ ద్వారా 717 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 6147 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి 1100 క్యూసెక్కుల నీటిని.మొత్తం 7964 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కుడికాల్వకు నీటిని విడుదల
నాగార్జున సాగర్ కుడికాల్వకు ఆంధ్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేసి నీటిని విడుదల చేశారు.వీరితో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.