Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక నుంచి బూర్జుబావి గ్రామంలోనే రేషన్ సరుకుల పంపిణీ
- ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
- ప్రభుత్వ విఫ్ సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
నియోజకవర్గకేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యే ప్రతి శనివారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో గుండాల మండలం వెల్మిజాల గ్రామఅమ్లేట్గా బుర్జుభావి గ్రామ ప్రజల రేషన్ సమస్య తీరడంతో ఆదివారం ఎమ్మెల్యే చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం నిర్వహించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ చేస్తూ కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు చేయగా బూర్గుభావి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడింది.అయినప్పటికి ఆ గ్రామస్తులు వెల్మజాల గ్రామానికి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వచ్చేది.వద్ధులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పలువురు సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైంది.దీంతో బూర్జుభావి గ్రామస్తులు శనివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌కు హాజరై ప్రభుత్వ విప్, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి తమ బాధను చెప్పుకున్నారు.ఆ వెంటనే స్పందించిన ఆమె విషయాన్ని భువనగరి ఆర్డీఓకు ఫోన్లో వివరించారు.గ్రామంలోనే రేషన్ సరుకుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు.సానుకూలంగా స్పందించిన అధికారులు ఇక నుంచి గ్రామంలోనే రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఆ గ్రామస్తులు విప్ సునీతామహేందర్‌రెడ్డికి ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలిపారు.