Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ప్రస్తుతం సీజనల్ వ్యాధులను గుర్తించి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో జిల్లా అధికార యంత్రాంగం వైద్య అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ డిమాండ్ చేశారు.ఆదివారం అనాజీపురం గ్రామంలో మండల అధ్యక్షులు దయ్యాల మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు.వర్షాల కారణంగా గ్రామాలలో దోమలు మురికినీరు గుంతలలో చేరి ప్రజలకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. జిల్లా ఆరోగ్యశాఖ వెంటనే గ్రామాలలో ప్రజలకు వైద్య ఆరోగ్య సదస్సులు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.గ్రామాల్లో అంతర్గత డ్రయినేజీ, వీధిలైట్లు, సీసీరోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కోశాధికారి ఏదునూరి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, మాజీ డీివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్, ప్రజాసంఘాల నాయకులు దయ్యాల నర్సింహ, ఏదునూరి మల్లేష్, గునుగుంట్ల శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శివ, బొల్లెపల్లి వెంకటస్వామి, బొల్లెపల్లి శ్రీకాంత్, జమాని కార్తీక్, పిట్టల శ్రీశైలం, నవీన్ పాల్గొన్నారు.