Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్ మార్గదర్శకుల తీరు ఇలా....?
- పర్యవేక్షించని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-నాగారం
ప్రయివేట్ పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నా అందుకు భిన్నంగా మండలపరిధిలోని పసునూర్ గ్రామంలో ఉన్న మోడల్స్కూల్లో జరుగుతుంది.ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం యతావిథిగా విద్యార్థులు 9 గంటలకు పాఠశాలకు చేరుకోగా పాఠశాల సిబ్బంది పాఠశాలను శుభ్రం చేయకపోవడంతో పాఠశాల మొత్తం అపరిశుభ్రంతో కనబడింది. సమయం 9.45 గంటలైనా వాచ్మెన్ నుండి ప్రిన్సిపాల్ వరకు ఏ ఒక్క పాఠశాలకు చేరుకోకపోవడం గమనార్హం. పాఠశాల మొత్తం వర్షపు నీటికి చెత్తాచెదారం పేరుకపోవడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఓవైపు ప్రభుత్వం విద్యార్థులకు నిర్ణిత సమయానికి పరీక్షలు నిర్వహిస్తుంది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు విద్యార్థులను అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వెనుదిరిగేలా చేస్తారు కానీ మరి మోడల్ స్కూల్ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కనీసం అటెండ్లు కూడా సమయపాలన పాటించకపోవడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు.రేపటి భవిష్యత్, సమాజ మార్గదర్శకులే ఇలా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ స్కూల్ మధ్యాహ్నభోజనం సరిగ్గా లేకపోవడంతో కొంత మంది విద్యార్థులు ఇంటి నుండి లంచ్‌బాక్స్ తీసుకుని వస్తున్నట్టు సమాచారం.ఈతతంగమంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మోడల్ స్కూల్ డీఓ పరిధిలో ఉంటుంది : ఇన్చార్జి ఎంఈఓ- బాలునాయక్
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సమయపాలన పాటించని విషయమై నవతెలంగాణ ఇన్చార్జి ఎంఈఓ బాలునాయక్‌కు ఫోన్లో సంప్రదించగా ఈ విషయం తమ పరిధిలో ఉండదు.మోడల్ స్కూల్ డీఓ పరిధిలో ఉంటుంది.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు
విద్యార్థి తండ్రి పొదిల నరేష్-పసునూరు గ్రామస్తుడు
మా అబ్బాయిని పసునూరు మోడల్ స్కూల్లో చదివిస్తున్నా. సోమయం ఉదయం 9 గంటలకే మా అబ్బాయిని స్కూల్ తీసుకెళ్లా. 9.45 గంటలకు వరకు కనీసం వాచ్మెన్, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఎవరూ రాలేదు.స్కూల్లో మధ్యాహ్నభోజనం కూడా నాణ్యంగా ఉండడం లేదు.