Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని వాడపర్తి గ్రామంలో డివిఆర్ వెంచర్లో కొనుగోలు చేసిన ప్లాట్లను ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడపర్తి గ్రామంలోని డివిఆర్ వెంచర్లో పదిమందిని కలిసి ప్లాట్లు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ప్లాట్ నెంబర్స్ వేసి, హద్దురాళ్ళు చూపించి, వెంచర్ వారు ఇవ్వగా, ఆ స్థలాన్ని ఈధుల కంటి దయాకర్ రెడ్డి ఆక్రమించాడని ఆరోపించారు. ఈ విషయంపై డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో యజమానులు ఆర్ వినతి, సుగుణ, శైలజ, భాగ్యలక్ష్మి, లక్ష్మి, రాకేష్, వెంకటేష్, నర్సింగరావు, అంజయ్య ఉన్నారు.