Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ నెల 3న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాలో హమాలీ కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలో ఉన్న రైస్ మిల్స్ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఎఫ్సీఐ బియ్యం కొనుగోలు లేకపోవడం వల్ల హమలీకార్మికులకు ఉపాధి కోల్పోయి కుటుంబాలు రోడ్డుమీద పడ్డాయన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో జానీ, బాల్ నరసింహ, నరసింహ, బిక్షపతి పాల్గొన్నారు.