Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాలోని 17 మండలాలలో పని చేయుచున్న 161 గ్రామ రెవెన్యూ అధికారులను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లాటరీ పద్ధతిలో శాఖలు కేటాయించినట్టు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ కేటాయింపుల ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.్ల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓల సంఘం సభ్యులు, టీఏన్జీఓ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా వీడియో రికార్డింగ్‌తో సహ నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం వీఆర్ఓ లను 32 శాఖలకు కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేయనైనదని ఆమె తెలిపారు. ఆర్డర్ పొందిన వెంటనే కేటాయించిన శాఖలకు రిపోర్టు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డిఓ సూరజ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, టీఎన్జీవో అధికారుల సంఘం సభ్యులు, వీఆర్ఓల అసోసియేషన్ సభ్యులు ,తహసిల్ధార్లు , అధికారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.