Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
సుదీర్ఘకాలం పాటు విప్లవోద్యమంలో అలుపెరుగని పోరాట యోధుడిగా, జీవితంలో ఎన్ని కృష్టనష్టాలు వచ్చినా ప్యూడల్ దురాగతాలకు ఎదురురోడ్డి పోరాడిన ఉక్కు మనిషి కాచం కృష్ణమూర్తి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కొనియాడారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో 16వ వర్థంతి పురస్కరించుకుని కృష్ణమూర్తి చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణమూర్తి జీవితాన్ని, పోరాట ఘటాలను స్మరించుకోవడం, ఆశయ సాధన కోసం కషి చేయడం కార్యకర్తల కర్తవ్యమన్నారు. తెలంగాణ ప్యూడల్ రాచరిక పాలన కొనసాగుతున్న రోజులలో జనగాం తాలూకా దేవరుప్పల మండలం నిర్మాల గ్రామంలో కష్ణమూర్తి మధ్యతరగతి కుటుంబంలో జన్మించార,ని బాల్యం నుండే పోరాట మార్గం ఎంచుకున్నాడన్నారు. ఐలమ్మ భూ పోరాటం ఆ తదుపరి సాగిన ఊరేగింపు పై దేశముఖ్ గుండాలు సాగించిన కాల్పులకు నేలకొరిగిన దొడ్డి కొమరయ్య ఉదంతం నుండి కష్ణమూర్తి కార్యాచరణ మండే కొలిమిలా గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచడం ,అడవుల్లో దళాలను నడపడం, భూ పోరాటం నిర్వహించడం, సంఘాన్ని విస్తరించడం, రోజువారి కార్యక్రమం అజ్ఞాతంలో 'రాగన్నగా' వెలుగొందారన్నారు. 1971లో వరంగల్ మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికై నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అనేక పోరాటాలలో ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. విప్లవోద్యమంలో ఆయన నిర్మాణ దక్షిత, పట్టుదల ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రజల వెన్నంటే ఉండి, ప్రజా ఉద్యమాలను జీవితంలో అంతర్భాగం చేసుకున్న గొప్ప పోరాట యోధుడు కాచం కష్ణమూర్తి అని కొనియాడారు. రాష్ట్రంలో పాలకవర్గాలు ప్రభుత్వ బంజరాయి, అటవీ భూములను, కారు చౌకగా అమ్మేస్తున్నారు. భూసంస్కరణల చట్టం, అసైన్మెంట్ చట్టం, 1/ 70 చట్టం, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వేల ఎకరాల్లో కట్ట బెడుతున్నారన్నారు. ఇంటి స్థలాల కోసం, సాగు భూమి కోసం, ప్రజలు భూమ్మీదికి వెళితే పోలీసుల అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపుతున్నారన్నారు. నేడు వరంగల్ పట్టణంలో జరుగుతున్న గుడిసెల పోరాటం చారిత్రాత్మకం ఈ పోరాట స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా సాగుభూమి, ఇండ్లస్థలాల పోరాటాలను విస్తతపరచడమే కష్ణమూర్తికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ,బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కష్ణ, గడ్డం వెంకటేష్ ,ఆఫీస్ కార్యదర్శి వడ్డే బోయిన వెంకటేష్, కోడెం శ్రీశైలం పాల్గొన్నారు.
రామన్నపేట : నిజాం, దేశముఖ్ ఆగడాలను ఎదిరించి వెట్టి చాకిరికి వ్యతిలేకంగా నినాదించిన పోరాట యోధుడు కాచం కష్ణమూర్తి పోరాటం నిత్య నూతన స్ఫూర్తి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జల్లెల పెంటయ్య అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో కామ్రేడ్ కాచం కష్ణమూర్తి 16వ వర్థంతి సందర్బంగా ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఆంద్రమహాసభ పిలుపుతో భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన వీరోచిత పోరులో ఆయుధం పట్టి రామన్నపేట తాలుకా ఏరియాలో సాయుధ పోరాటం నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, నాయకులు మామిడి వెంకట్ రెడ్డి, పబ్బతి లింగయ్య, బల్గూరి అంజయ్య, యాదాసు యాదయ్య, కందుల హనుమంతు,బావండ్లపల్లి బాలరాజు, బోయిని ఆనంద్, యం.డి రషీద్,పిట్టల శ్రీను, బావండ్లపల్లి సత్యం, శానగొండ వెంకటేశ్వర్లు, గునగంటి మల్లేశం, కూందూరు వెంకటేశం, పులిపలుపుల శివకుమార్, జోగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అమరజీవి కాచం కష్ణమూర్తి 16వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు ఆకుల ధర్మయ్య, ఎమ్‌డి.ఖయ్యుమ్, పిసాటి నాగరాజురెడ్డి, బోయ యాదయ్య, నందగిరి వెంకటేశం, ముత్యాలు, భాస్కర్, లింగస్వామి, వెంకటేశం, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జానీ, మహేశ్ పాల్గొన్నారు.
మోత్కూర్ : పేద ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడిన నాయకుడు కాచం కష్ణమూర్తి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లు యాదగిరి అన్నారు. కాచం కష్ణమూర్తి 16వ వర్ధంతిని ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కేంద్రంలో కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కృష్ణమూర్తి చేసిన త్యాగాలను నేటికీ మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, జిల్లా కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, కందుకూరి నర్సింహ, మెతుకు అంజయ్య, జి.లక్ష్మి,పి.శోభ, అరుణ, మంగమ్మ, సత్తమ్మ, నాగయ్య పాల్గొన్నారు.
రాజాపేట: భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పీడిత ప్రజల నాయకుడు కాచం కష్ణమూర్తి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు అన్నారు. కష్ణమూర్తి 16వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సభ నిర్వహించారు. కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరు పోశెట్టి, గడ్డం వెంకటేష్, మండల నాయకులు రాధమ్మ, కష్ణవేణి తదితరులు పాల్గొన్నారు..