Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన పది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదివేందుకు డీఆర్డీఏ ద్వారా ఉచిత సీట్లు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.అంజయ్య తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు బయ్యని శ్రీవర్థిని, పత్తి లావణ్య, కందుల భవ్య, చెరుకు నవ్యశ్రీ, చేడే అంకిత, పులి సింధూశ్రీ, మడూరి సౌమ్య, వరిపెల్లి దుర్గాప్రసాద్, బొల్లు ప్రవీణ్ ఉత్తమ ఫలితాలతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి డీఆర్డీఏ ద్వారా సీట్లు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు ఉపాధ్యాయులు బందారపు దుర్గాప్రసాద్, ఇ.రాంప్రసాద్, జి. వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, వెంకన్న, నిజాం, ప్రవీణ్ కుమార్, వెంకటాచారి, రవి, మంజుల తదితరులు అభినందించారు.