Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట: కాసం కృష్ణమూర్తి జీవితం ఆచరణీయమని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. సోమవారం స్థానిక మల్లువెంకటనర్సింహారెడ్డి భవన్లో కాసం కృష్ణమూర్తి చిత్రపటానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు,సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవింద్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసుసత్యం, చేనేత కార్మికసంఘం జిల్లా నాయకులు చిదిరాల నారాయణ, సీఐటీయూ పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య పాల్గొన్నారు.
తిరుమలగి : మండలకేంద్రంలోని అంబేద్కర్ఫూలే చౌరస్తాలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య ఆధ్వర్యంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత కాసం కష్ణమూర్తి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారుడు ప్రభాకర్, ఫత్తేపురం యాదగిరి, గౌడ విద్యార్థిసంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపూరి శ్రీకాంత్‌గౌడ్, బీసీసంఘం నాయకులు సర్దార్రాజన్న, రమేష్, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పట్టణంలోని సుందరయ్యభవన్‌లో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నక్క గోపి, పడిసిరి నర్సింహారావు, జల నాగరాజు, జాల శివ పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్ :భూ పోరాటాల స్ఫూర్తి ప్రదాత కె.కష్ణమూర్తి ఆశయ సాధనకు కషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు.సోమవారం పట్టణంలోని అమరవీరుల స్మారకభవనంలో కాచం కష్ణమూర్తి 16వ వర్థంతి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భూమికోసం, విముక్తి కోసం, ప్యూడల్ రాచరిక దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప పోరాటయోధుడని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా కార్యదర్శి శీలం శ్రీను, పాశం వెంకటనారాయణ, చిన్నంవీరమల్లు, రేపాకుల మురళి, ఆంజనేయులు, లక్ష్మీ పాల్గొన్నారు.