Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించిన నిందితుని పట్టుకున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ విలేకర్లకు వివరాలు వెల్లడించారు. జూలై 30న తుక్కాపూర్ గ్రామానికి చెందిన రాసాల వీరయ్య భువనగిరికి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తుండగా, గమనించిన వ్యక్తి అదే ఆటోలో వెళ్లి, అనాజిపురం పరిధి దివ్య బాల స్కూల్ ముందర వీరయ్య దిగడంతో అతను కూడా దిగాడు. వీరయ్యను వెంబడించి పొలాల్లో ఆయన చేతులను కట్టేసి, అతని చెవికి ఉన్న బంగారు పోగు, వెండి మూల తాడు లాక్కొని జేబులో ఉన్న పైసలు తీసుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తుండగా అతను భువనగిరి మండలంలోని పచ్చర్లపాడు తండాకు చెందిన కునుశోతు లింగుగా గుర్తించారు. కాగా ఇతను గతంలో నందన గ్రామంలో జరిగిన వద్ధ మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దోపిడీ కేసులు నమోదయి ఉన్నట్లు తెలిపారు. నిందితుని నుంచి బంగారు చెవి పోగు 2.4 గ్రాములు, వెండి నడుము గొలుసు (26) తులాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భువనగిరి ఏసిపి వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సిఐ సత్యనారాయణ, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, క్రైమ్ సిబ్బంది వినోద్ మహేష్ కొండారెడ్డిలను డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.