Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-తుర్కపల్లి
ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీి సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో చలో హైదరాబాద్ ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజలను గమ్యస్థానాలకు చేరవేస్తూ,ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు , అసంఘటిత రంగం కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్మికులకు పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోతరాజ్ జహంగీర్ ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన బలరాం ఆటో యూనియన్ అధ్యక్షులు బోయిన్ సత్తయ్య నాయకులు గుండెబోయిన రాజు శ్రీను రుక్నాదం పాల్గొన్నారు.