Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ - భువనగిరి
సమాజ శ్రేయస్సుకోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమ కోసం పనిచేసి అమరులైన త్యాగమూర్తులను స్మరించుకుంటూ యాదాద్రి భువనగిరిజిల్లావ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 18 వరకు సామాజిక చైతన్య యాత్రలు చేసి సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్టు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజుగౌడ్ అన్నారు. భువనగిరిలో సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి ఉత్సవాలు ముగింపు సభ ఉంటుందని తెలిపారు. . శుక్రవారం స్థానిక వత్తి దారుల భవన్లో ఆసంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అద్యక్షులు రాగీరు కష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అమరుల యాదిలో పేరుతో జిల్లావ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులందరికీ వత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, గీతన్న బందు పేరుతో కుటుంబానికి రూ.10 లక్షలఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు రాగీరు కష్ణయ్య మాట్లాడుతూ. మద్య నిషేధం దశలవారీగా అమలు చేయాలని,50 ఏండ్లు పైబడిన వారికి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెజికెఎస్.జిల్లా కార్యదర్శి బొలగాని జయ రాములుమాట్లాడుతూ. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు . ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్కలి బిక్షపతి, కొక్కొండ లింగయ్య, పండాల మైసయ్య, గాజుల అంజనేయులు, బత్తిని బిక్షం, కొమ్మ గాని దశరథ, పల్సం అంజయ్య పాల్గొన్నారు.