Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పేదలు వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు.సోమవారం ఆ సంఘం, బీకేఎంయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పెంచిన పెట్రోల్, డీజిల్ ,వంటగ్యాస్ ధరల పెంపు మూలంగా పేద, వ్యవసాయ కార్మికులపై మోయలేని భారం పడుతుందన్నారు.దళిత,గిరిజనులకు మూడెకరాల సాగు భూమి, పేదలందరికీ ఇండ్లు, స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు 8ఏండ్ల కాలంలో ఏ ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలను,ఇనాం భూములను తెలంగాణ ప్రభుత్వం అభివద్ధి పేరుతో బలవంతంగా తీసుకుంటుందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పేదల ఆధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధికూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల నిత్యావసరాలు అందించాలని కోరారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డికి అందజేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి దూళిపాళ్ల ధనుంజయనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా నాయకులు వల్లపు దాసు సాయికుమార్, తెెలంగాణ రైౖతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెమిడాల రాజు,జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,సోమపంగు జానయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దంతాల రాంబాబు ,మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు అనంతుల మల్లేశ్వరి, వ్యవసాయకార్మికసంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరేరామకష్ణారెడ్డి,సీపీఐ పట్టణకార్యదర్శి బూరవెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చిలకరాజు శ్రీను, సీఐటీయూ పట్టణకన్వీనర్ మామిడి సుందరయ్య పాల్గొన్నారు.