Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుగా కమిటీ సభ్యులకు కార్డులు అందచేత
- కలెక్టర్ టి.వినరు కష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జర్నలిస్టులు అకిడిటేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి అన్నారు.జిల్లాలో 2022-24 గాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు అందజేసే అక్రిడిటేషన్ కార్డులను మొదటగా కలెక్టర్ తన చాంబర్లో సోమవారం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 383 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ అందిస్తున్నామన్నారు. త్వరలో రెండో సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో అదనపు పౌరసంబంధాల అధికారి హాబీబ్ మహ్మద్, కమిటీ సభ్యులు జి.శ్రీనివాస్‌గుప్తా, వజ్జె వీరయ్య, రాంబాబు, సీహెచ్.చంద్రశేఖర్, పి.శ్యామ్‌సుందర్, అంజన్, ఏ. యాకయ్య పాల్గొన్నారు.