Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతిసభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్మికుల సంక్షేమానికి నకిరేకంటి అంజయ్య విశేష కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నకిరేకంటి అంజయ్య ఏడవ వర్థంతి సభ నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారన్నారు.కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు ముందుండి నడిపారని గుర్తు చేశారు.చివరి శ్వాస వరకు ఎర్రజెండా నాయకత్వంలో పనిచేశారని చెప్పారు. కార్మిక లోకానికి ఆయన మరణం తీరని లోటన్నారు.ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు కషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సమాజంలో అసమానతలు పెరిగిపోయాయని వాటిని రూపుమాపేందుకు బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి రావాలంటే తమ సమాజస్థాపనే లక్ష్యమన్నారు.దాని సాధన కోసం క్షేత్రస్థాయి నుండి ఉద్యమాలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, తిరుపతి రామ్మూర్తి, డా.మల్లుగౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు, గాదె పద్మ, వరలక్ష్మీ, పాదూరి గోవర్థన, పరుశరాములు, దేశీరాంనాయక్, కృపాకర్‌రెడ్డి, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.