Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని షేరు బావి గూడెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పులి పల్లి నర్సిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం పులి పల్లి నర్సిరెడ్డి మతి చెందారు. సోమవారం నర్సిరెడ్డి భౌతికకాయాన్ని ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎర్రజెండా కప్పి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సిరెడ్డి మతి చాలా బాధాకరమన్నారు. 30 ఉండంల నుంచి పార్టీ సభ్యునిగా కొనసాగుతున్నారన్నారు. 2007లో ఉదయ సముద్రం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే మరొకచోట భూమి కల్పించాలని అప్పటి ప్రభుత్వంపై పోరాటం చేసిన ఘనత నర్సిరెడ్డికి దక్కిందన్నారు. నర్సిరెడ్డి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య ,బండ శ్రీశైలం ,జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఆర్ వెంకటేశ్వర్లు ,నర్సిరెడ్డి ,నార్కట్ పల్లి మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, మండల మాజీ కార్యదర్శి గాలి నర్సింహ, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి ,పార్టీ మండల కమిటీ సభ్యులు చింతపల్లి బయన్న ,దండు రవి, ఐలయ్య ,యాదగిరి రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు దండు శంకర్ ,శ్రీను, శంకరయ్య ,నాగరాజు, సైదులు ,ఏనుగుల శంకర్, కొరివి శ్రీను , మాడగొని సైదులు, తదితరులు పాల్గొన్నారు .