Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
- కలెక్టరేట్ ముట్టడిలో పలువురు నాయకులు
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
నార్కట్‌పల్లి మండలంలోని 14 గ్రామపంచాయతీలను కలిపి అమ్మనబోలు ను మండల కేంద్రంగా ప్రకటించాలని లేనిపక్షంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు సుధాకర్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్, పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి హెచ్చరించారు. అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ నార్కట్‌పల్లి మండలంలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, గ్రామాల ప్రజలతో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ ముట్టడిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మంత్రి గ్రామ అయినందున నాగారంను మండలం గా ప్రకటిం చారని అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో గెలుపు కోసం గట్టుపల్ను కూడా మండలంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. నార్కట్‌పల్లి మండలానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మనబోలును కూడా మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 20 కిలోమీటర్ల దూరం ఉన్నందున అభివద్ధికి నోచుకోవడం లేదని, అక్కడ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. మూడు రోజుల్లో అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించకపోతే ఈ నెల 5న నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమ్మనబోలు గ్రామ సర్పంచ్ బద్దం వరలక్ష్మి రామిరెడ్డి, పిఆర్పిఎస్ నాయకులు పథ్వీరాజ్, విజరు, ప్రదీప్, ఎంపీటీసీలు కొంపల్లి సైదులు, కే లక్ష్మమ్మ, మోహన్ రెడ్డి, జి లక్ష్మమ్మ, కే శంకర్ రడ్డి, అంజయ్య, సావిత్రి, కుమారస్వామి, సతీష్, పద్మా వెంకటరెడ్డి, సర్పంచులు బండారు మల్లయ్య, బండా రేణుక, అశోక్ రెడ్డి, మాధవి, నరసింహ, శేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సోమయ్య, ఆండాలు, పురుషోత్తం రెడ్డి, ఉప సర్పంచ్ లు కొమ్ము యాదగిరి, బందెల లింగయ్య, గిన్నెల శివప్రసాద్, మురళి, జనార్ధన్, శేఖర్, సురేష్ యాదవ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.