Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మాడుగులపల్లి: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్నసమ్మెకు సోమవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డిపార్టుమెంట్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పనిచేస్తూ 20 ఏండ్ల నుండి రైతాంగానికి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ అనేక పనులు చేస్తున్న వీఆర్ఏలకు గౌరవ వేతనం పేరుతో రూ.10500 మాత్రమే ఇస్తూ వెట్టి చేయించుకుంటున్నారని విమర్శించారు.అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతం ముఖ్యమంత్రి పేస్కేల్ జీవో ప్రకారం వారికి వేతనాలు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చని పరిస్థితి ఇచ్చిన మాటే నెరవేర్చని కేసీఆర్ వీఆర్ఏలని ఏ విధంగా ఆదుకుంటాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.వీఆర్ఏల సమ్మెకు తమ పార్టీ సంపూర్ణమద్దతు తెలుపుతుందన్నారు.ఈకార్యక్రమంలో వేములపల్లి వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్థన, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డబ్బికార్ మల్లేష్, మాడుగులపల్లి మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, వీఆర్వోల సంఘం ప్రధాన కార్యదర్శి జూలకంటిప్రణీత, వెంకన్న, నగేష్, మృదుల పాల్గొన్నారు.