Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-దామరచర్ల
తరగతుల వారీగా విద్యార్థులందరూ విషయ సామర్ధ్యాలు కలిగి ఉండేలా బాధ్యతాయుతంగా ఉపాద్యాయులు బోధన చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు.దామరచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు 3 రోజులపాటు ఏర్పాటుచేసిన తొలిమెట్టు శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణార్థుల నుండి శిక్షణాంశాలకు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.తరగతి గదిలో అభ్యసన ప్రక్రియలు అమలుపరిచే క్రమంలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసి వెనుకబడిన విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే విధంగా కషి చేయాలని చెప్పారు. విద్యా సంవత్సరం చివరి నాటికి విద్యార్థులు అందరూ పైతరగతుల సామర్థ్యాలు కలిగి ఉండే విధంగా నిరంతర పర్యవేక్షణతో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఉపాధ్యాయులు వత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు.ఆగస్టు 15 నుండి ఈ విద్యా సంవత్సరం పూర్తి అయ్యేవరకు తొలిమెట్టి కార్యక్రమం అమలుచేయాలన్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి ప్రతివారం స్లిప్ టెస్టులు గ్రాండ్ టెస్టుల ద్వారా గ్రేడింగ్ నమోదు చేయాలని, మానిటరింగ్ అధికారులు వాటిని యాప్ లో పొందుపరిచి రికార్డు చేస్తారని చెప్పారు.నిరంతర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలవుతుందని అలసత్వం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులను చదివించి,ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీనాయక్, కోర్టు డైరెక్టర్ మంగ్యానాయక్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పిచ్చయ్య, ఈసోర్స్పర్సన్ సైదిరెడ్డి, భోజ్యా, షఫీ పాల్గొన్నారు.