Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పెరిగిన ధరలకనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు పెంచి అమలు చేయాలని, జిల్లా వ్యాప్తంగా పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు వెంటనే నూతన పాసు బుక్కులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు, పేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండోసారి అధికారంలోకి వచ్చినంక ప్రజల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ శక్తులకు పోటీపడి రాయతీలు కల్పిస్తూ ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంకు నిధులు పెంచి సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రూ. 600 రొజు కూలీ ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనులను పేదలకు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, బికేఎంయు జిల్లా అధ్యక్షులు ముత్యాలు పాల్గొని మద్దతు తెలిపి మాట్లాడారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, జెల్లెల పెంటయ్య, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు సల్లూరి కుమారు, జిల్లా సహాయ కార్యదర్శి గుంటోజి శ్రీనివాస్ చారి,జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, మెతుకు అంజయ్య, దొడ్డి బిక్షపతి, సిలువేరి ఎల్లయ్య, ఎర్ర ఉషయ్య, చింతకాయల నరసింహ, బల్గూరి అంజయ్య నాయకులు కొండ అశోక్, కూకుట్ల కష్ణ, చానకొండ వెంకటేష్, జి లక్ష్మి, వి.భారతమ్మ, శ్రీను, మల్లేష్ పాల్గొన్నారు.