Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
ఓటర్ నమోదు, జాబితాలో మార్పుల కోసం భారత ఎన్నికల సంఘం నూతన ఫారములను ప్రవేశ పట్టిందని, ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిబంధనల్లో స్వల్ప మార్పులు, గరుడ యాప్, ఆన్లైన్ వెబ్ సైట్ల వినియోగం,ఓటర్ జాబితాలో నమోదు, మార్పుల పై నూతన ఫారాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన మార్చులు ఆగస్టు 1, 2022 నుండి అమలులోకి వస్తాయని, ఫారం-6 నూతన ఓటర్ల నమోదు కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుందని, ఫారం-7 ద్వారా ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఇకపై మరణ ధవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందని, ఫారం 8 ద్వారా ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో నివాసం మార్చు, నమోదు చేసిన వివరాల సవరణ, కొత్త ఓటరు ఫోటో గుర్తింపు కార్డ్ జారీ కొరకు వైకల్యం ఉన్న వ్యక్తిగా, ఓటరుగా గుర్తించడానికి అభ్యర్థన వంటి అంశాల కోసం ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్- 6బిను ప్రవేశపెట్టడం జరిగిందని, ఎన్నికల సంఘం ఆదేశాల క్రమము, ఓటరు జాబితాలో ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు, తమ పేరు నమోదును ధవీకరించుకొనుటకు ఆధార్ నంబర్‌ను ఫారం-6బి ద్వారా తెలియచేయవలసి ఉంటుందని, ప్రతి పౌరునికి ఒకే ఒక్క ఓటు హక్కు మాత్రమే ఉంటుందని, ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాపై ఈ నెల 4 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్ నిర్వహించి నవంబర్ 9న ముసాయదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్ 8వ తేదీ వరకు సదరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్ రెడ్డి,ఎన్నికల డి.టి.విజరు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సిపిఐ (ఎం) పి నర్సిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పిచ్చయ్య, కాంగ్రెస్ నాయకులు జై సైదిరెడ్డి, వైయస్సార్సీపి శ్రీరాములు, ఏఐఎంఐఎం నాయకులు ఎండి రజియోద్దీన్, సిపిఐ నాయకులు ఎల్ శ్రవణ్ యాదవ్, బీఎస్పీ నాయకులు కోడి రాంప్రసాద్, టిడిపి నాయకులు ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.