Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులు తినే ఆహారపదార్థాలను పరిశీలించారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచకపోవడంతో పాటు సరైన పౌష్టికాహారం అందించలేకపోతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఖైదీలపై ఉన్న శ్రద్ధ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే విద్యార్థులపై లేకపోవడం బాధాకరమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జైలులో ఉన్న ఒక్కో ఖైదీపై రోజుకు 80 రూపాయలు భోజనాలకు ఖర్చు పెడుతుందని,అదే హాస్టల్ విద్యార్థిపై కేవలం 30 రూపాయలు మాత్రమే ఖర్చుచేస్తుందన్నారు.ఇవి విద్యార్థులకు ఏమాత్రం సరిపోవని నెలకు 3 వేల రూపాయల మెస్‌చార్జీలు ఇవ్వాలన్నారు.గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.ప్రతి ఒక్క గురుకుల విద్యార్థిపై సంవత్సరానికి లక్షా 20 వేలు ఖర్చుపెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం కనబడడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, దసరాజ్ జయరాజ్, చేగొండి మురళి యాదవ్, అశోక్, వీరయ్య, శ్రీనివాస్, వంశీ, శేఖర్ తదితరులుపాల్గొన్నారు.