Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చౌటుప్పల్రూరల్
పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికుల కనీస వేతనాలను పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ కంపెనీ ముందు కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలను ప్రభుత్వాలు సవరించాల్సి ఉంటుందని తెలిపారు. 68 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల వేతనాల జీవోలను సవరించాలని కోరారు. అసంఘటితరంగాలలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రతిష్ట ఇండిస్టీస్ యూనియన్ అధ్యక్షులు ఎండి పాషా, కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు పల్సము యాదగిరి, యాట సత్యనారాయణ, గోవర్ధన్, లలిత, అంజమ్మ ,పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.