Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండరూరల్
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి సారి జరిగే అమరుల యాదిలో మంగళవారం నుండి నుండి 18 వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య సభలు నిర్వహించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అమరుల యాదిల పేరుతో జిల్లావ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు. జ్యోతి బాపూలే,సావిత్రిబాయి పూలే,నారాయణ గురు, పెరియార్ రామస్వామి అంబేద్కర్ లాంటి సామాజిక నాయకులు,సంఘసంస్కర్తల జీవిత విశేషాలను వారు చేసిన సేవలను ఈ తరానికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి సత్తయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్, జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, ఆలిండియా లాయర్స్ యూనియన్ సభ్యులు బొమ్మ రగోని కిరణ్ కుమార్, కెవిపిఎస్ మండల కార్యదర్శి రవీంద్ర కుమార్, వివిధ సంఘాల నాయకులు ఆ వడ్డగోని నరసింహ , తదితరులు పాల్గొన్నారు.