Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
విద్యుత్ కోతలు నివారించి రైతులకు సక్రమమైన కరెంటు అందించాలని రైతు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి ,మాటూరు బాలరాజు డిమాండ్ చేశారు మంగళవారం తెలంగాణ రైతు సంఘం వలిగొండ మండల 7వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా 24 గంటలు కరెంటును రైతాంగానికి అందిస్తామని చెప్పి కనీసం ఎన్ని గంటలు విద్యుత్ వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ కోతల వల్ల అనేక మంది రైతాంగం తాము పెట్టిన పంటలు ఎండిపోతున్నాయని మోటార్లు,ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నీట మునిగి పత్తి వరి వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి,రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి,రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మొగిలిపాక గోపాల్,కందడి సత్తిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు మెరుగు వెంకటేష్,వాకిటి వెంకటరెడ్డి,మండల నాయకులు పెద్ద బోయిన నరసింహ,గూడూరు బుచ్చిరెడ్డి,కందగట్ల సాయి రెడ్డి,భీమిడి ఇంద్రారెడ్డి, దండెం నర్సిరెడ్డి,ఫైళ్ల సత్తిరెడ్డి,బద్దం మల్లారెడ్డి పాల్గొన్నారు.