Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400 కేజీల గంజాయి స్వాధీనం
- మూడు కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ- నల్లగొండ
గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 200 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కేజీలు. మొత్తం 400 కేజీల గంజాయి మొత్తం విలువ రూ. 12 లక్షలు
మూడు కార్లు, 05 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వివరాలు వెల్లడించారు. మంగళ వారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు జిల్లా టాస్క్ఫోర్స్ బందంతో సమన్వ యంతో తిప్పర్తి పిఎస్ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పద రీతిలో మూడు కార్లలో 04 మంది వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ుూ 07 జుఔ 0784 నంబర్ గలశఖV500 వాహనాన్ని తనిఖీ చేయగా 100 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, ఇందులో నాగుల్ మీరా ను పట్టుకోగా అంగోతు నాగరాజు పరారీ అయ్యాడు. తదుపరి దాని వెనకనే వస్తున్న బాలెనో వాహనం లో 50 గంజాయి ప్యాకెట్లను స్వాదినం చేసుకొని, ఇందులో మీసాల నీలేష్, సైదా లు పట్టుబడగా బొడ్డుపల్లి శ్రీను పరారైనాడు. స్విఫ్ట్ డిజైర్ బ్లాక్ కలర్ కారులో 50 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ఇందులో నుండి మాడ్గుల రాహుల్ పట్టుబడ్డారు. విశాల్ పరారీ లో ఉన్నాడు. వారిని పట్టుకుని విచారించగా, వారంతా కోదాడలో నివాసం ఉంటున్నారని, స్నేహితులమని, అక్రమ సంపాదన కోసం గంజాయిని స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏపీ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మర్రిగూడ గ్రామానికి చెందిన ఈశ్వర్ నుంచి తక్కువ ధర కి కొనుగోలు చేసిన గంజాయిని వీరు పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్నారు. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఆకాష్ పరకాలే మరియు కరణ్ పరకాలేకు ఎక్కువ ధర కి అమ్ముతారు. గతంలో అంగోతు నాగరాజు, సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తులను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. వీరు మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ప్రారంభించారు. గతంలో వీరందరూ 14 సార్లు రాష్ట్ర సరిహద్దుల గుండా గంజాయి రవాణా చేశారు.ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ఏడుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న ఎ. వెంకటయ్య, ఇన్చార్జి సీఐ ఆఫ్ పోలీస్, శాలిగౌరారం, ఎం. సత్యనారాయణ ఎస్ఐ ఆఫ్ పోలీస్, తిప్పర్తి పిఎస్, జిల్లా టాస్క్ ఫోర్స్ బందం డిఎస్పీ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలో వై. మొగిలయ్య నల్గొండ డిఎస్పీ వి. నర్సింహారెడ్డి. ఎస్పీ అభినందించారు.