Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్మెన్ సందీప్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జిల్లా ప్రజా పరిషత్తు నిధులచే నిర్మించిన నూతన అదనపు గదిని ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రధానంగా పుస్తకాల కొరత లేకుండా విద్యార్థులందరికీ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బీరు మల్లయ్య, సర్పంచ్ ఎడ్ల రాజి రెడ్డి, పీఏసీిఎస్ డైరెక్టర్ ఎడ్ల సత్తిరెడ్డి, భువనగిరి వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, నరాల వెంకటస్వామి, మండల నాయకులు పాల్గొన్నారు.