Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాలసర్పంచులు, ఎంపీటీసీలు మంగళవారం రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి వినతిపత్ర అందజేశారు. రాందాస్ తండా, ముష్టిపల్లి గ్రామాలకు 33 కేవీ సబ్స్టేషన్లు గతంలో మంజూరయ్యాయని, స్థలసే కరణలో జాప్యం వల్ల పనులు ప్రారంభించ లేదన్నారు.సంబంధిత అధికారులచే వెంటనే స్థల సేకరణ జరిపించి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.అదేవిధంగా తుంగపాడు వద్ద పులుసు వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, నాగార్జునసాగర్ హైవే నుంచి దేవత్‌పల్లి- శర్భాపురం మీదుగా వెంకటంపేట వరకు, నాంపల్లి- కొండమల్లెపల్లి ఆర్అండ్బీ రోడ్డు నుండి బండతిమ్మాపురం మీదుగా పాటిమీదిగూడెం వరకు, తుమ్మలపల్లి నుంచి మేళ్ళవాయి వరకు, గట్లమల్లేపల్లి నుంచి తుమ్మలపల్లి వరకు పీిఆర్ రోడ్లపై బీటీ నిర్మాణం చేపట్టాలని కోరారు.అన్ని సావధానంగా విన్న మంత్రి తప్పకుండా పనులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ డైరెక్టర్లు నడింపల్లి యాదయ్యగౌడ్, కడారి శ్రీశైలంయాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు సర్ధార్, ప్రచారకార్యదర్శి ఏడుకొండలు, సర్పంచులు గుండాల అంజయ్యయాదవ్, జిల్లెల్ల యాదమ్మసైదులు,రమావత్ రవినాయక్, నాగులవంచశ్రీలత, ముష్టిపల్లి ఎంపీటీసీ రమావత్ బుజ్జి పాల్గొన్నారు.