Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రాచకొండ లోని ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం నాడాయన రాచకొండలోని రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం గిరిజనులతో మాట్లాడారు.ఎనిమిదిన్నర ఏండ్లుగా భూ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నానన్నారు.తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు గాని నేను గాని సంతోషంగా లేనన్నారు.ఇట్లాంటి ఎమ్మెల్యే పదవి తనకెందుకు అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయాల గిరిజనులను అడిగారు.ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు రైతులను వేధించడం జరుగుతుందన్నారు. గిరిజనులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. 80 ఏళ్లుగా సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న గిరిజనుల భూములను లాక్కోవాలని చూస్తే ప్రజల సహించరన్నారు. టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ ప్రాంత రైతుల సిద్ధంగా ఉన్నారన్నారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించేందుకు ఇబ్బంది ఎందుకు పడుతున్నారని గిరిజనులను ఇబ్బందులు గురి చేయడం సరికాదన్నారు.ప్రాణం ఉన్నంతవరకు గుంట భూమి పోనీ అని అన్నారు. ఇదే మాట ఎనిమిదిన్నర ఏండ్ల నుంచి చెప్తున్నారు సారు! మా సాగు భూముల్లో గుంటలో తీసి చెట్లు నాటుతున్నరు. ఇంకా ఎంత సమయం కావాలి పరిష్కరించడానికి చెప్పండి అని గిరిజనులు నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందుకు తనను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్ నాయకులు బుజ్జి కరంతో బిక్షపతి నాయక్ భద్రగోని నరసింహ ఎస్కే షబ్బీర్ అలీ, శ్రీధర్ రెడ్డి, మందుగల బాలకష్ణ కాత్రోతు సాగర్, దేవా, లచ్చు తదితరులు ఉన్నారు.