Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గంలో విస్తృత పర్యనటలు
- అనుచరులతో మంతనాలు
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయం వెడెక్కుతుంది. దాంతో నల్లగొండ జిల్లాలో గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. పార్టీ అవిర్బాం నుంచి పనిచేసిన నాయకులను కాదని పార్టీ పెద్దలు కొత్తవారిని తీసుకువచ్చి టికెట్లు ఇచ్చారు. దాంతో నైరాశ్యంలో ఉన్న ఆ ఆనాయకులంతా అయితే ఈసారి ఎలాగైనా టికెట్ సాధించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే నల్లగొండ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నేత ఒకరు ఈసారి టికెట్ సాధించి విజయతీరాలను చేరాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తన అనుచరులతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యమ కాలంలో పనిచేసిన క్షేత్రస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి నేతలందరిని కలిసి తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి చర్చలు చేస్తున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిది
నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాలకు పెట్టింది పేరు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా నల్లగొండ జిల్లా చుట్టే తిరుగుతుంటాయి. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూనే, టీిఆర్‌ఎస్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన నేతలకు సరైనా గుర్తింపు రావడంలేదనే ఆవేదనలో ఉద్యమ నేతలున్నారు. అందులో భాగంగానే నల్లగొండ నియోజకవర్గంలో పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా పార్టీ కోసమే పనిచేసిన నేతల్లో జిల్లా కేంద్రానికి చెందిన చాడ కిషన్‌రెడ్డి ఒకరు. 2018లో నల్లగొండ అసెంబ్లీ టికెట్ ఆశించిన వారిలో ఆయన కూడ ఒకరు. అయితే నాటి రాజకీయ సమీకరణాల దృష్ట్యాగత 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించాలంటే 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి రెండోస్థానంలో నిలిచిన కంచర్ల భూపాల్‌రెడ్డికి నియోజకవర్గఇన్‌చార్జీ కట్టబెట్టారు. అయితే ఈ విషయంలో ఉద్యమ కాలం నుంచి పనిచేసిన సీనియర్ నేతలకు అసంతృప్తికి గురయ్యారు. అందుకే వారందరిని బుజ్జగించి, ఒప్పించడంతో అందరు కంచర్ల గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించారు. దానిఫలితంగానే నల్లగొండ కోటపై గులాబి జెండా రెపరెపలాడింది.
అయితే వచ్చే ఎన్నికలలో నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ సాధించాలనే పట్టుదలతో చాలా మంది నేతలున్నారు. వారిలో ఉద్యమ నేత చాడ కిషన్‌రెడ్డి కూడ ప్రముఖంగా ఉన్నారు. అయితే దాదాపు ఏడాది కాలంగా రెండుసార్లు వివిధ సందర్బాలలో కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కెేటీిఆర్ను జిల్లాకు సంబందించిన అందరితో కలిసి వారిని కలిసినట్లు తెలిసింది. ఆ సమయంలో ''రానున్న రోజులు నీకు అనుకూలంగా ఉంటాయి.' ఇబ్బంది పడకు అంటూ సీఎం భుజం తట్టడం... మరోసారి కేటీఆర్‌ను కలిసిన వేళ 'సీఎం గారితో నీ గురించి మాట్లాడిన ఒకసారి కలవండి'' అంటూ అప్యాయంగా పలకరిస్తూనే మేమున్నామనే భరోసాను కల్పించారని సమాచారం. అంతేగాకుండా ఈ మధ్య కాలంలో పీకేసర్వే అందరి ఎమ్మెల్యేల పనితీరును, ప్రజల్లో వారికున్న బలబలాలను తెల్చిచెప్పిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మద్య ప్రజలలో ఉన్న బలుకుబడి ఉన్న వారికే వచ్చే ఎన్నికలలో టికెట్లు కేటాయిస్తామని, కొంతమంది అభ్యర్థులకు మార్చాల్సిన ఆగత్యం ఏర్పడుతుందని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఏలాంటి బేషజాలు లేకుండా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడంతో అందరివాడుగా కిషన్‌రెడ్డికి గుర్తింపు ఉంది. జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కూడ సత్ససంబందాలు ఉండటంతో పాటుగా దాదాపు పార్టీ సీనియర్ నేతులు, మంత్రివర్గ సభ్యులందరితో కూడా కలివిడిగా ఉంటారని ప్రతి ఒక్కరు చెపుతుంటారు.
మరోవైపు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డికి మద్య తీవ్రమైన వర్గపోరు ఉంది. ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భంగుమనే పరిస్థితి ఉంది. పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికి ఇద్దరు ఏడమోహం పెడమోహంగానే ఉండడంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది.పార్టీ అధినేత తనకు ఈసారైనా టికెట్ ఇస్తే విజయం సాధించి తీరుతానని చాడ కిషన్‌రెడ్డి పెర్కొంటున్నారు. అందులో భాగంగానే తన కార్యాచరణను ప్రారంభించిన ఆయన పల్లెపల్లెలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను కలిసి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఏదేమైనా చాడకు న్యాయం జరిగేనా వేచిచూడాల్సిందే.