Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను..వెంటనే పంపిణీ చేయాలి
- సిపి(ఐ )ఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ - నార్కట్పల్లి
జిల్లాలో ఉన్న పోడు భూముల కోసం ఇక పోరుబాటేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అనాదిగా వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూములపై అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తూ భూములను లాక్కునే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆగస్టు మాసంలో పోడు భూములపై ప్రత్యేక పోరు చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్టు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో ఈ ఆగస్టు మాసం మొత్తం పెద్ద ఎత్తున భూపారాటాలు నిర్వహించాలని పార్ట్టీ జిల్లా కమిటీ నిర్ణయించిందని దానికి అనుగుణంగా ఈ నెల 4న ముఖ్యమైన బాధ్యులతోటి వర్క్ షాప్ నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా పోడు భూములు కష్ణ పట్టే మండలాలలో పది పన్నెండు మండలాలలో వేలాది ఎకరాలు ఇప్పటికే పోడు సాగు చేసుకుంటున్నా టువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఆటంకపరిచే విధంగా వ్యవహరిస్తున్నదన్నారు. గతంలో పట్టాలు ఇస్తామని కలెక్టరేట్లో కూడా మీటింగ్ పెట్టి మంత్రి కూడా చెప్పామన్నారు. ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోగా ఆ సాగు చేసుకోవడాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇండ్ల స్థలాలను నిరుపేదలైనటువంటి వారికి స్వాధీన పరచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటానికి దిగి ప్రభుత్వం లాక్కున్న భూములను గుర్తించి ఆ స్థలాలను పేదల పంచేందుకుగాను జెండాలు పాతనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే గతంలో సర్వే చేసిన నివేదికల ఆధారంగా గుర్తించిన గ్రామాల జాబితా తమ దగ్గర ఉందని వాటిపై పోరుకు సమయత్వం కావాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. నార్కట్ పల్లి మండలం లో నక్కలపల్లి ,బ్రాహ్మణ వెల్లంల ఔరవాణి ,గ్రామాల్లో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి వెంటనే అర్హులైన వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు శ్రీ రామో జు వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి చెరుకు పె ద్దు లు ,మాజీ మండల కార్యదర్శి గాలి నరసింహ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరి గౌడ్ మండల కమిటీ సభ్యులు చింతపల్లి బయన్న నన్నేసాబ్ ,దండు రవి,యాదగిరిరెడ్డి ,ఐలయ్య,సైదులు,గోపాల్ పాల్గొన్నారు.