Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగ భూషణం
నవతెలంగాణ-కోదాడరూరల్
పోలీస్ నియామక పరీక్షలు పారదర్శకంగా నిర్వహి ంచాలని కోదాడ డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగభూషణం అన్నారు.మంగళవారం పట్టణపరిధిలోని బాలాజీనగర్‌లో కెఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు,నోడల్ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.పరీక్షావిధానంలో ఎక్కడ అవకతవకలు జరగకుండా నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు.అందుకుగాను ముందస్తు గానే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.పరీక్షల నిర్వహణ ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని, నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాల న్నారు.పోలీసు నియామక పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగు మాట్లాడుతూ పరీక్ష నిర్వహణ విధానంపై చీఫ్ సూపరింటెండెంట్లకు, రూట్ ఆఫీసర్లకు సూచనలు చేశారు.పలు సందేహాలను నివత్తి చేశారు.అనంతరం జేఎన్టీయూ అధికారి పి.రాజేష్ బయోమెట్రిక్ అటెండెన్స్ వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ నోముల వెంకటేశ్వర్లు, కోదాడ,హుజూర్నగర్ పోలీసుఅధికారులు పాల్గొన్నారు.