Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నియోజకవర్గ పరిధిలో నమోదైన దొంగఓట్లు, డబుల్ ఓట్లను తక్షణమే తొలగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం ఓటర్ల నమోదుపై మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రోహిత్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.వివిధ పార్టీల ప్రతినిధులు,నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్డీఓ దష్టికి తీసుకెళ్లారు.ప్రధానంగా మిర్యాలగూడ, వేములపల్లి, అడవిదేవులపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి మండలాల్లో పరిధిలో సుమారు 20 వేల దొంగఓట్లు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.వెంటనే వీటిని విచారించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడిరాజు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, కాంగ్రెస్ పట్టణఅధ్యక్షులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి పరంగి రాము, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రతన్‌సింగ్, చిలుకూరు శ్యామ్, ఎంఐఎం కార్యదర్శి ఫరీదుద్దీన్ పాల్గొన్నారు.