Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ప్రభుత్వం పాఠశాలల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల తో పాటు, మండలపరిధిలోని పెద్దనెమిల ప్రాథమిక పాఠశాలలో రూ.16.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను, సీసీరోడ్లను ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి ఈ కార్యక్రమాన్ని అమలు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు చూడిలింగారెడ్డి,సర్పంచులు తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి,మరాఠి రామస్వామి, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, సురకంటి జానమ్మ మల్లారెడ్డి, తహసీల్దార్ జమీరోద్దీన్, ఎంపీడీఓ ఇందిర, పీఆర్ఏ లావణ్య,మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి సాయిల్‌గౌడ్, మండలనాయకులు యాస ఎల్లారెడ్డి, బత్తులవిద్యాసాగర్ పాల్గొన్నారు.