Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
గత సంవత్సర కాలంగా రామన్నపేట గ్రామపంచాయతీ పాలకవర్గం నీవు అవినీతి చేశావంటే, నీవు అవినీతి చేశావంటూ సర్పంచ్, ఉప సర్పంచ్ పరస్పరం ఆరోపణలను చేసుకుంటున్నారని, జిల్లా అధికారులు రాజకీయ ప్రమేయం లేని నిజ నిర్ధారణ కమిటీ వేసి అవినీతి, అక్రమాలపై నెగ్గు తేల్చాలని సీపీిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి గాదె నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో జలంధర్ రెడ్డికి ఈ మేరకు పట్టణ కమిటి ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అభివద్దిని గాలికొదిలారన్నారు. రామన్నపేట గ్రామ పంచాయతీ ఓన్నత్యాన్ని పాడు చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే దూషనలతో కాలమెల్లదీయటం సరికాదన్నారు. పంచాయతీ కార్యదర్శికి సంబందం లేకుండా అక్రమ దవపత్రాలు సష్టించి, ప్లాట్లు రిజిస్టేషన్ చేసుకుని అమ్ముకుంటున్న పరిస్థితి ఉండడం దారుణం అన్నారు. అధికారులు వెంటనే చొరవ తీసుకుని చర్యలు తీసుకొని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటి సభ్యులు పిట్టల శ్రీనివాస్, గంజి అశోక్, బావండ్లపల్లి సత్యం పాల్గొన్నారు.