Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
డ్రయినేజీ కాలువ పనులను పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు అధికారులను డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని రెడ్చిల్లీ వెనకాల డ్రయినేజీ కాలువ కట్టాలని, రోడ్డు పక్కన తవ్వడం జరిగిందన్నారు.ఈ కాలువను తవ్వి మూడునెలలవుతున్నా దానిని ఏ అధికారిగానీ, మున్సిపల్ కౌన్సిలర్గాని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు.ఈ ఏరియాలో ఉన్న వాహనదారులు, ప్రజలు రాత్రిపూట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాల్వ సరిగా లేక వర్షం వచ్చినప్పుడు చెరువులా నిండుగా ఉంటుందన్నారు. కనీసం వీధిలైట్లు కూడా లేని పరిస్థితి దాపరించిందన్నారు.ఈ కాలువలో పందులు, కుక్కలు తిరుగుతూ దుర్వాసన వెదజల్లుతునామ్నయన్నారు.కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, మన్యంలింగయ్య, మందడివెంకటేశ్వర్లు, పాలెల్లి కష్ణ, సైదులు,మాతంగిసురేష్, వెంకన్న పాల్గొన్నారు.