Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీఓ నివేదిక ఇవ్వకముందే కేసు నమోదు
మిర్యాలగూడ:రాజకీయ ఒత్తిళ్లు.... పోలీసుల అత్యుత్సాహం... నడుమ ఓ అంగన్వాడీ టీచర్‌పై కేసు నమోదు ఐన సంఘటన బుధవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలకు వెళ్ళితే.... పట్టణంలోని బంగారిగడ్డ 29వ వార్డులో అంగన్వాడీటీచర్గా పనిచేస్తున్న జూలకంటి మల్లేశ్వరిపై ఆ వార్డుకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ షేక్ జావిద్ గత కొన్ని నెలలుగా రాజకీయకంగా ఆమె పై పెత్తనం చేలాయిస్తున్నాడు.అన్ని విషయాలలో జోక్యం చేసుకొని ఆమెను వేధిస్తున్నాడు.ఈ కోణంలో ఆమె తన అద్దె సెంటర్‌ను మార్చేందుకు ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చింది. కానీ సదరు కౌన్సిలర్ జావిద్ ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సెంటర్ మరకుండా ఒత్తిడి తెచ్చారు.టీచర్ పై అన్ని రకాల ఒత్తిడి తేవడంతో కౌన్సిలర్ తెలియకుండా అంగన్వాడీ సమన్లు రాత్రిపూట తరలిస్తుండగా విషయం తెలుసుకున్న కౌన్సిలర్ దొంగతనం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు.దీనితో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ విషయంపై సీడీపీఓ సెంటర్‌ను సందర్శించి విచారణ చేశారు.వాస్తవానికి సెంటర్ మారుస్తున్నదని నిర్దారణ కాగా అట్టి రిపోర్ట్ పోలీసులకు ఇవ్వక ముందే పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి రాత్రికి, రాత్రే కేసు నమోదు చేశారు.బుధవారం ఉదయం టీచర్, కౌన్సిలర్ రాజీపడి పిటిషన్ ఉపసంహరించుకునేందుకు వెళ్లగా అప్పటికే కేసు నమోదైందని సీఐ సురేష్ తెలిపారు....
టీచర్ పై మానసికవేధింపులు.... సీడీపీఓ మమత
అంగన్వాడీ టీచర్‌పై అక్కడి కౌన్సిలర్ మానసిక వేధింపులు పాల్పడుతున్నాడు.వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. కౌన్సిలర్‌తో ప్రాణభయం ఉన్నదనే ఆమె సెంటర్ మార్చేందుకు ప్రయత్నం చేసింది...ఎలాంటి దొంగతనం కాలేదు. ఇదే విషయం విచారణలో తేలింది. అట్టి నివేదికను బుధవారం పోలీసులకు ఇచ్చా.గతంలోనే కౌన్సిలర్ వేధింపులకు పాల్పడుతుండటంతో ఎస్పీకి పిర్యాదు చేసింది.
ఎలాంటి ఒత్తిళ్లు లేవు:సీఐ సురేష్
అంగన్వాడీ సెంటర్లో దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది.వెంటనే సిబ్బందిని పంపించాము.అప్పటికే రాత్రి 1 గంట సమయం అవుతుంది.ఆ సమయంలో సామాను తరిస్తున్నట్టు కనిపించింది.వెంటనే ఆటోను,సామానును స్టేషన్‌కు తరలించాం.టీచర్, కౌన్సిలర్ ఇరువురు పిటిషన్ ఇచ్చారు.విచారించి కేసు నమోదు చేశాం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.