Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సమీకత శాఖాహార, మాంసాహార మార్కెట్ నిర్మాణం చేపట్టాలని బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య మాట్లాడారు.3-8- 2021 నిధులు స్పెషల్ బడ్జెట్ 2021 అంచనా విలువ రూ.4.50 కోట్లు మార్కెట్ కోసం శంకుస్థాపన చేశామన్నారు.ఈ ఏడాది పూర్తైనా ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేని ఆరోపించారు.మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టి వ్యాపారాలకు న్యాయం జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.నిర్మాణాన్ని చేపట్టకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పల వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు జల్దా భాస్కర్, సముద్రాల సహదేవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిశంకర్, పార్లమెంట్ జోనల్ ఇన్చార్జి వస్కుల సుధాకర్, పట్టణ ఉపాధ్యక్షులు గంజిహరి, నాయకులు నారాయణదాసు చండీశ్వర్, చిలకరాజు శ్రీను, కాసుల శంకరయ్య, అప్పంఅజరు, కామోజీ విజరు, అర్థంరమేష్, దస్రునాయక్ ఉన్నారు.