Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
ఇటీవల కురిసిన వర్షాలకు యాదగిరికొండపై రోడ్లు పలు చోట్ల గండి పడి ఇబ్బందులు కలిగిన ఘటన మరవక ముందే ఈ సారి మొదటి ఘాట్ రోడ్డు గోడ కూలీ గండి పడింది. వివరాల్లోకి వెళితే.. యాదగిరికొండ పైకి వెళ్లే ఎడమ పక్కా మొదటి ఘాట్ రోడ్డు కింది భాగం బుధవారం గండి పడింది. దీని ఎదురుగా పుట్ట కూడ ఉంది. నాగుల పంచమి వేడుకలు ఇక్కడే జరగడం గమనార్హం. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం ఇక్కడ విశేషం. మంగళవారం రాత్రి 11గంటల నుండి వేకువజామున 3గంటల వరకు కురిసిన వర్షానికి కొద్దిగా కుంగి రిటైనింగ్ వాల్ వెంట కింది వరకు తెగిపోయింది. ఈ రోడ్డుకు సపోర్టుగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వరద తాకిడికి కూలిపోయింది. దీంతో కొత్తగా కొండపైకి పై ఓవర్ నిర్మాణం జరుగుతున్న చోట వర్షం నీరు జాలువారి ఈ గండి ఏర్పడింది. ఈ సంఘటన రాత్రి జరగడంతో ఎలాంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. సుమారు 50 గనెట్ రాళ్ల వరకు ఊడిపోయాయి. దీంతో హుటాహుటినా ఈ రోడ్డు వెంట భారీ వాహనాలు, ఇతర వాహనాలు, భక్తులు వెళ్లకుండా పోలీసులు బారీకెడ్లు అడ్డం పెట్టారు. టెక్నికల్ కమిటీ పరిశీలించింది. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత బారీకెడ్ల సహకారంతో యథావిధిగా రాకపోకలు సాగించారు. ఆలయ అధికారులు, స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కూలీల రిటర్నింగ్ వాళ్ళు స్థలాన్ని పూర్తిగా తొలగించి అదే ప్రదేశంలో కొత్తగా నిర్మించడానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. కానీ ఈ ఆలయం పునర్నిర్మాణమైన తర్వాత ఒక్కొక్కటిగా లోపాలు బయట పడుతుండడంతో చర్చనీయాంశం కాగా భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
నిజాం కాలంలో...
ఈ ఆలయంలో నాటి నిజాం ప్రభుత్వం హయాం నుంచే పరిపాలనా వ్యవహారాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ ఆలయానికి తొలి ధర్మకర్తల మండలి నియమాకం నిజాం ప్రభుత్వ ంనుండే కొనసాగింది. మూడవ నిజాం రాజు మీర్ యూసుఫ్ అలీఖాన్ హయాంలో భువనగిరి డివిజన్ తహసీల్దార్ రాజాబ్అలీ ఈ ఆలయానికి మొదటి ధర్మకర్త. పాలక మండలి చైర్మెన్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే 1940లో కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం జరిగింది. 1974 వరకు (రాయి మొరంతో) ఈ ఘాటు రోడ్డు నిర్మాణం పూర్తి అయినట్టు పూర్వీకులు తెలిపారు.