Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ది పేరుతో రూ.33.20కోట్లు మంజూరు
- చండూరును రెవెన్యు డివిజన్‌గా మార్చేందుకు చర్యలు
- మునుగోడు నేతన్నల కోసమే చేనేత బీమా
ఎన్నికలోస్తేనే నియోజకవర్గ అభివృద్దికి నిధులొస్తాయని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందులో భాగంగానే ఈ మద్య మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ పార్టీలో చేరుతానని అనేకసార్లు ప్రకటించారు. దాంతో పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని ఆ పార్టీ షరతు విధించడంతో దానికి సిద్దమైనట్లు కూడ వార్తలొస్తున్నాయి. దాని కారణంగానే నియోజకవర్గంలో ఎపుడైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ భావిస్తుంది. గత ఎన్నికలలో ఓడిపోయిన సీటును ఇపుడు ఏలాగైనా చేజిక్కించుకోవాలనే తపనతో అధికార పక్షం చర్యలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే మునుగోడు సెగ్మెంట్ ఓటర్లకు గాలం వేసే పనిలో పాలక పక్షం నిమగమై ఉంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి.
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలు రానున్నాయి. అక్కడ ఏలాగైనా గెలవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సెగ్మెంట్ మొత్తంలో నిధుల వరదను పారించేందుకు సిద్దమువుతన్నట్లు తెలుస్తుంది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భరంగా జరిగిన బహిరంగ సభలో జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.20లక్షలు, మండలానికి రూ.30లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మునుగోడులో మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నందున పాలకపక్షం ఆ నిధులివ్వలేదని తెలుస్తుంది. అనేకసార్లు కోమటిరెడ్డి అరిచిగిపెట్టిన సీఎం వైపు నుంచి ఏలాంటి స్పందన లేదు. కానీ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సీఎం శరవేగంగా నిధులను విడుదల చేశారని సమాచారం. నియోజకరవ్గంలోని 157 గ్రామాలకు గాను ప్రతి గ్రామానికి రూ.20లక్షలు, ఆరు మండలాలలో మండలానికి రూ.30లక్షల చొప్పున మొత్తంగా రూ.33.20కోట్లు నిధులను విడుదల చేశారు. ఇవేగాకుండా ఏ గ్రామంలో ఏ సమస్యలున్నాయి... వాటి పరిష్కారానికి నిధులెన్ని కావాలన్నా తాము విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారు.
-- రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చండూరు...
నూతన మండలాలు ఏర్పడ్డ నాటి నుంచి గట్టుప్పల్ మండల కేంద్రం కావాలని దీక్షలు, నిరసనలు చేస్తున్న ప్రజల మనసును చూరగొనేందుకు, దాంతోపాటుగా వారి ఓట్లను రాబట్టుకునేందుకు పాలకులు గట్టుప్పల్‌ను ప్రత్యేకంగా మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉంటే మారుమూల ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న చండూరును ఎంతో కాలంగా రెవెన్యూడివిజన్ కేంద్రంలో చేయాలని ఆ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ వస్తుంది. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న ప్రజల కోరికను ఈ ఎన్నికల వేళ తీర్చి ఓట్లకు గాలం వేయాలని అధికార పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వ్యాపార కేంద్రంగా పేరున్న చండూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇప్పటికే సంబందిత అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. అంతేగాకుండా అత్యధికంగా ఓట్లు కలిగిన నేతన్నల ఓట్లను వేసేందుకు ఆగస్టు 7న నేతన్న భీమా పథకం ప్రారంభించనున్నారు.
-- ఓటర్లకు గాలం వేసేందుకే...
ఏలాగైనా ఉప ఎన్నికలలో నెగ్గాలనే పంతంతోనే అధికార పార్టీ తన కార్యచరణను అమలు చేసే క్రమంలో అడుగులు వేస్తుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజీనామా చేస్తాడన్న ప్రకటన వచ్చిన రోజునే ఒక మండలం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వారం రోజులు గడవకముందే నియోజకవర్గం అభివృద్ది చేసేందుకు నిధులు ప్రకటించడమేగాకుండా,7న ప్రారంభమయ్యే చేనేత భీమా పథకం, రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయడమంటే ఓటర్లకు ఇప్పటి నుంచి గాలం వేయడమే. ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుంటే అభివృద్ది జరగదని పరోక్షంగా ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీచేసినట్లే.అంతేగాకుండా వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేసేందుకు కూడ అధికార పార్టీ సిద్దంగా ఉందని తెలుస్తుంది.